Abuse of emotions: సంబంధాల్లో అలాంటి ప్రవర్తన.. ఇది గుర్తించకపోతే నష్టం!

by Javid Pasha |
Abuse of emotions: సంబంధాల్లో అలాంటి ప్రవర్తన.. ఇది గుర్తించకపోతే నష్టం!
X

దిశ, ఫీచర్స్ : దంపతులు లేదా ప్రేమికుల మధ్య సంబంధాలు సహజంగానే భావోద్వేగాలతో నిండి ఉంటాయి. అప్పుడప్పుడూ గొడవలు, భేదాభిప్రాయాలు కూడా కామనే. కొట్లాడుకోవడం, తాత్కాలికంగా ఇవన్నీ జరిగిపోతుంటాయి. అయితే ఉద్దేశ పూర్వకంగా జరిగినప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. భాగస్వామి ఇష్టం లేకనో, విడిపోయే ఉద్దేశంతోనో, పలు విషయాల్లో తనకు లోబడి ఉండాలనే ఆధిప్యత్యంతోనో భాగస్వామి ఇలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దీనినే ‘గ్యాస్ లైటింగ్’ బిహేవియర్ అంటున్నారు నిపుణులు. ఇక్కడ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లేదా ఎమోషనల్ అబ్యూజ్‌కు పాల్పడటే అసలు టార్గెట్‌గా ఉంటుంది. ఈ లక్షణాలుగా గుర్తిస్తే జాగ్రత్త పడాలంటున్నారు. ప్రమాదకర ప్రవర్తనను గుర్తించి మరి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.

* మీకు తెలియకుండానే మీ భాగస్వామి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. అలా చేస్తూ క్రమంగా మీమీద మీరు నమ్మకం కోల్పోయేలా చేస్తారు. మిమ్మల్ని శారీరక, మానసిక బలహీనులుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా వారు తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతీ విషయంలో అబద్ధాలు చెప్పడం, వేధించడం, తమ తప్పును కప్పి పుచ్చుకోవడం వంటి ప్రవర్తన కనిపిస్తుంది. దీనిని గుర్తిస్తే ఏదైనా జరగొచ్చని అనుమానించాలి. ముందు వారికి దూరంగా ఉండి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

*మిమ్మల్ని వదిలించుకోవాలని భావించినప్పుడు శారీరకంగా, మానసికంగానే కాదు, ప్రతీ సందర్భంలో మీ భావోద్వేగాలపై ఎదుటి వ్యక్తి దెబ్బకొడుతుంటారు. భాగస్వామిలో ఈ లక్షణం గుర్తిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు. పార్ట్‌నర్‌కు తెలియకుండానే వారిలోని మాటలు, చేతలు గమనించడం, హింసాయుత ధోరణిని పసిగట్టడం ద్వారా తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలనేది మీకు మీరు ఆలోచించుకోవాలి.

*భాగస్వామి మీపై జెలసీ, కోపం రెండూ పెంచుకుంటారు. మీరు ఏ పని చేసినా వారికి నచ్చదు. పైగా మిమ్మల్ని తప్పు పడుతూ ఉంటారు. అందరిముందు విమర్శిస్తారు. మీది తప్పు వారిదే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తిస్తారు. ఈ ప్రవర్తన కూడా ‘గ్యాస్ లైటింగ్’ అంటే భావోద్వేగా దుర్వినియోగ లక్షణాల్లో భాగమే. అలాంటి వ్యక్తులవల్ల మీ ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి జాగ్రత్త పడటం బెటర్ అంటున్నారు నిపుణులు.

*హెల్తీ రిలేషన్‌లో గొడవలు, విభేదాలు ఉంటాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం కూడా జరుగుతుంటాయి. కానీ మిమ్మల్ని టార్గెట్ చేసి వేధించాలని చూస్తే ‘గ్యాస్ లైటింగ్’ బిహేవియర్ అలా కాదు. ఏ విషయంలోనూ మీతో ఏకీభవించకపోవడం, మీ మీద దాడి చేసేందుకు ప్రయత్నించడం, వాస్తవాలు ఒప్పుకోకపోవడం భావోద్వేగా దుర్వినియోగం కిందికే వస్తాయంటున్నారు నిపుణులు.

*అనుమానం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనుమానాలు ఎవరికైనా వస్తుంటాయి. కూర్చొని మాట్లాడుకోవడం, క్లియర్ చేసుకోవడం ఆరోగ్యకరమైన సంబంధాల్లో భాగంగా నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ప్రతీ విషయంలో అవమానించడం, అనుమానించడం, నిందించడం, దాడికి యత్నించడం చేస్తుంటే మాత్రం మిమ్మల్ని వదిలించుకోవాలనే దురుద్దేశం కావచ్చు లేదా ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆధీనంలో ఉంచుకునే ఆధిపత్య భావం కావచ్చు. ఈ విధమైన ప్రవర్త కనిపిస్తే మీరు రిస్క్‌లో పడవచ్చు. కాబట్టి పరిష్కారం దిశగా ఆలోచించాలి.

Next Story

Most Viewed