ఛీ.. నాకు మనిషి తగిలాడు.. అని స్నానం చేస్తున్న పురుగు

by Sujitha Rachapalli |
ఛీ.. నాకు మనిషి తగిలాడు.. అని స్నానం చేస్తున్న పురుగు
X

దిశ, ఫీచర్స్ : డైనోసార్ల కాలం నుంచే ఉంటున్న బొద్దింకలు.. ఆహారం లేకుండా నెల రోజులు, నీరు లేకుండా రెండు వారాలపాటు జీవించగలవు. తల లేకుండా ఏడు రోజులు కూడా బతికే ఈ జీవి... నలభై నిమిషాలపాటు శ్వాస తీసుకోకుండా ఉండగలవు. ఏది దొరికితే అది తినే బొద్దింకలను... కీటకాలు, అరాక్నిడ్‌లు, సరీసృపాలు, పక్షులు, ఉభయచరాలు, క్షీరదాలు అన్నీ తింటాయి. ఇక ఈ పురుగులు ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే.. జీవితాంతం గర్భం ధరించే అవకాశం ఉంది.

అయితే మనుషులు దారుణంగా అసహ్యించుకునే ఈ కీటకాలు .. మనిషి తాగితే వెంటనే వెళ్లి స్నానం చేస్తాయట. వీటిలో 4000కు పైగా రకాలు ఉండగా.. ఏడాదికి 150 పిల్లలకు జన్మనిస్తాయని తెలుస్తుంది. పెద్దగా అయ్యాకే వీటికి రెక్కలు వస్తాయి. ఇక వీటి పాలు ఆవు పాలకన్నా మూడు రెట్లు అధిక పోషకాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.

Advertisement

Next Story