ప్రతిరోజూ అక్కడ శుభ్రం చేసుకోవచ్చా? సబ్బు వాడొచ్చా లేదా?

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-02 11:13:59.0  )
ప్రతిరోజూ అక్కడ శుభ్రం చేసుకోవచ్చా? సబ్బు వాడొచ్చా లేదా?
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజూ స్నానం చేస్తాం. శరీర భాగాలన్నింటికి సబ్బు పెట్టుకుంటాం. కానీ ముఖానికి మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మాయిశ్చరైజర్, సన్‌‌స్క్రీన్ లోషన్ అంటూ అనేక క్రీమ్స్ వాడుతాం.దీంతో ఫేస్ మెరిసిపోతుంది. కాళ్లు, చేతులు వాడిపోయి కనిపిస్తుంటాయి. అయితే అలా కాకుండా బాడీ మొత్తాన్ని కూడా అంతే స్పెషల్ ఇంట్రెస్ట్‌తో చూడాలని సూచిస్తున్నారు నిపుణులు. అప్పుడే ఎలాంటి అలెర్జీ, స్కిన్ సమస్యలు దరిచేరవని చెప్తున్నారు.

అయితే ప్రతి అంగానికి సోప్ అవసరమా? అంటే చర్మాన్ని బట్టి చేంజ్ చేయొచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు. పొడి చర్మం కలిగి ఉంటే ప్రతిరోజూ అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు కానీ తేమగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మన చర్మాన్ని రక్షించే పొర సబ్బు నురగ కారణంగా పాడైపోవచ్చు. సూక్ష్మజీవులు ఎటాక్ చేసే చాన్స్ పెరగొచ్చు. తద్వారా ఈజీగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రైవేట్ పార్ట్స్(జననేంద్రియాలు) విషయానికి వస్తే చాలా సున్నితమైనవి. కాబట్టి ఈ ప్రదేశంలో సబ్బు పెట్టకూడదనే నిపుణులు చెప్తుంటారు. స్పెషలైజ్డ్ క్రీమ్స్ వాడితే బాగుటుందని సూచిస్తారు. ఇక ఈ ప్రాంతాల్లో హాట్ వాటర్ కూడా యూజ్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.

Read More..

మానసిక ఒత్తిడితో స్కిన్ ప్రాబ్లమ్స్.. మొహంపై మొటిమలు కూడా అందుకే వస్తాయా?

Advertisement

Next Story