అందంగా ఉందని అరెస్ట్ చేశారు!!

by sudharani |   ( Updated:2023-01-03 12:33:57.0  )
అందంగా ఉందని అరెస్ట్ చేశారు!!
X

దిశ, ఫీచర్స్: అరెస్ట్ చేసేందుకు సవాలక్ష కారణాలుంటాయి. కానీ చాలా అందంగా ఉన్నారని అరెస్ట్ చేయడం ఎప్పుడైనా విన్నారా?. అందంగా కనిపించడం నేరం అయితే కాదు కానీ యూఎస్‌లో ఓ మహిళను మాత్రం ఈ విషయంపై అదుపులోకి తీసుకున్నారన్న వార్త వైరల్‌గా మారింది. ఇంతకీ దీని వెనుక అసలు కారణమేంటో తెలుసుకుందాం.

ఒక విచిత్రమైన సంఘటనలో యూఎస్‌లోని విమానాశ్రయ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి ఫుల్లుగా లాగించేసింది 28ఏళ్ల హెండ్ బుస్టామి. సెప్టెంబర్ 2022లో చిలీస్ టెక్స్-మెక్స్ రెస్టారెంట్‌లో హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసిన ఆమె.. బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయింది. దీంతో రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ పోలీసులను సంప్రదించగా.. సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద వారి కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగిస్తూ బుస్టామి నిద్రపోతున్నట్లు నటించింది. మొత్తానికి తమకు సహకరించకుండా, తమతో హుందాగా ప్రవర్తించకుండా.. ఉమ్మేస్తానని బెదిరించిందని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఒకరకమైన యుద్ధం ప్రకటించిందని చెప్పుకొచ్చారు.

కానీ బుస్టామి ప్రకారం అధికారులు వక్రబుద్ధిగలవారని.. తన లాంటి అందమైన అమ్మాయిని ఇంతకు ముందెన్నడూ చూడకపోవడంతో.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఫైనల్‌గా బుస్టాన్ తప్పుడు ఆరోపణల కారణంగా.. క్లార్క్ కౌంటీ డిటెన్షన్ ఫెసిలిటీలో ఉంచారు. అక్టోబర్ 27న కోర్టు ముందు హాజరుపరచగా.. దాదాపు లక్ష రూపాయల పూచీ కత్తుతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

ఇవి కూడా చదవండి : స్త్రీలను బట్టల్లేకుండా చూడలేను: నైతిక విలువలుండాలంటున్న Ridhi Dogra

Advertisement

Next Story