Viral : అనుమతి లేకుండా కన్నారని తల్లిదండ్రులపై కేసు(Video)

by Sujitha Rachapalli |   ( Updated:2024-06-02 09:37:07.0  )
Viral : అనుమతి లేకుండా కన్నారని తల్లిదండ్రులపై కేసు(Video)
X

దిశ, ఫీచర్స్: న్యూ జెర్సీకి చెందిన ఓ యువతి నెట్టింట ట్రెండ్ అవుతుంది. అనుమతి లేకుండా తనను ఈలోకం లోకి తీసుకురావడం అమ్మానాన్న తప్పు అంటుంది. అందుకేనా వాళ్లపై కేసు కూడా పెట్టానని చెప్పింది. దీంతో నెటిజన్లు పొట్టు పొట్టు తిడుతున్నారు. ఇష్టం లేకుంటే వారితో ఉండొద్దు కానీ అలా ఎలా చేస్తావని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఎంత పాపం చేస్తే నువ్వు పుట్టావో.. అందుకే ఇలా ఇబ్బంది పెడుతున్నావ్ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే చివరికి తేలింది ఏంటంటే.. తను జోక్ చేశానని, సోషల్ మీడియా పేజ్ పేరు సెటైర్ అని చూశాక కూడా అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారని క్లారిటీ ఇచ్చింది. ఇక దీంతో కొందరు చల్లబడితే.. ఇంకొందరు డబుల్ తిట్లు తిట్టిపోసారు. ఇలాంటి పిచ్చి వీడియోలు పెట్టి జనాల ఎమోషన్స్ తో ఆడుకోవద్దని మండిపడుతున్నారు. ఇంకోసారి వీడియోలు అప్ లోడ్ చేసినా బాగోదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story