- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుహలో నుండి బయటకొచ్చిన కోటానుకోట్ల గబ్బిలాలు.. షాకింగ్ వీడియో!
దిశ, వెబ్‌డెస్క్ః ఒక పెద్ద చెట్టుకు వేలాడుతున్న గబ్బిలాలను చూస్తే, ఒళ్లు గగ్గురుపొడుస్తుంది. అలాంటిది, నదీ ప్రవాహంలా కనిపించే కోటాను కోట్ల గబ్బిలాలను ఒకటేసారి చూస్తే ఎంత షాకింగ్‌గా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మెక్సికోలోని ఒక గుహ నుండి గబ్బిలాల గుంపు బయటకు ఎగిరిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూవ్స్, లక్షల్లో లైకులు వస్తున్నాయి. "ఈ గుహలో నుండి ఉద్భవిస్తున్న నదీప్రవాహంలాంటి అంతులేని గబ్బిలాలను చూడండి" అని పోస్ట్ క్యాప్షన్‌కు తగ్గట్టుగానే కారులో నుండి రికార్డ్ చేసిన ఈ వీడియోలో, క్యూవా డి లాస్ ముర్సిలాగోస్ (గబ్బిలాల గుహ) నుండి లెక్కలేనన్ని గబ్బిలాలు ఎగురుతున్నట్లు చూడొచ్చు. ఈ గబ్బిలాల సమూహం ఒక దిశలో ఆకాశం వైపు ఎగురుతుంటే, నల్లటి పొగ చిమ్మినట్లు కనిపిస్తుంది. "బాట్‌మాన్ తన గ్రేట్ మిషన్ కోసం ఈ గబ్బిలాలను పిలిచాడు" అంటూ నెటిజనులు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
Watch this endless river of bats emerging from this cave
— Science girl (@gunsnrosesgirl3) July 22, 2022
This is Cueva de los Murciélagos in Mexico pic.twitter.com/JbmbhOdgHc