బ్రెయిన్‌పై ఎఫెక్ట్ చూపుతున్న స్మోకింగ్.. ఇతర వ్యసనాలను కూడా ప్రేరేపిస్తుందట !

by samatah |   ( Updated:2023-08-17 05:45:28.0  )
బ్రెయిన్‌పై ఎఫెక్ట్ చూపుతున్న స్మోకింగ్.. ఇతర వ్యసనాలను కూడా ప్రేరేపిస్తుందట !
X

దిశ, ఫీచర్స్ : స్మోకింగ్ అలవాటు ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే అది మెదడును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, తద్వారా ఇతర అనేక వ్యసనాలకు కారణం అవుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తరచూ ధూమపానం చేయని టీనేజర్ల మెదడుతో పోల్చితే.. చేసేవారి మెదడు భిన్నంగా ఉంటుందని, అది పలు బలహీన ప్రవర్తనలను ప్రేరేపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్ యూకేలోని వార్విక్ యూనివర్సిటీ, చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం పరిశీలనలో తేలింది.

యుక్త వయస్కులు ఓ వారంరోజులపాటు ధూమపానం చేశాక, ఆ అలవాటును కంటిన్యూ చేయాలనుకుంటారని, తర్వాత అది వ్యసనంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏజ్‌లో ఉన్నప్పుడు మెదడులోని నిర్దిష్ట ప్రాంతాలలో గ్రే మాటర్ లెవల్స్ (బూడిద రంగు పదార్థాలు) అందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. దీంతోపాటు అనేక బలహీనతలు, ఇతర వ్యసనాలు కూడా స్మోకర్లలో త్వరగా అలవడుతాయని పరిశోధకులు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా వారు 14, 19, 23 సంవత్సరాల వయస్సు గల మొత్తం 8 వందల మంది స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ వ్యక్తుల బ్రెయిన్ ఇమేజింగ్ అండ్ బిహేవియర్ డేటాను ఎనలైజ్ చేశారు. అయితే నాన్ స్మోకర్స్‌తో పోల్చితే 84 శాతం మంది స్మోకర్స్ అనేక వ్యసనాలు, బలహీనతలు, అనారోగ్యాలకు త్వరగా గురవుతున్నట్లు గుర్తించారు. అలాగే స్మోకర్లు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలకు కూడా ఇతరులతో పోల్చితే త్వరగా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.

Advertisement

Next Story