- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
39 ఏళ్ల వయసులో 20 వ బిడ్డకు జన్మనివ్వబోతున్న మహిళ.. ప్రతి బిడ్డ తండ్రులు వేర్వేరు.. పైగా ప్రభుత్వం అనుమతితో!
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో వింత వింత ఘటనలు చూస్తూనే ఉంటాం. ఒకే భర్తకు 20 మంది భార్యలంటూ.. ఒకే భార్యకు పది మంది భర్తలు.. ఇరవై మంది పిల్లలంటూ నెట్టింట వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా దీనికి విభిన్నమైన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. ‘‘మెడెలిన్‌కు చెందిన 39 ఏళ్ల మార్తా అనే మహిళ ఇప్పటికి 19 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో పదిహేను మంది పిల్లలు 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారు.
మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ.. ప్రతి పిల్లల తండ్రులు వేర్వేరు వ్యక్తులు. పైగా మార్తాకు ఇలా పిల్లలకు జన్మనిచ్చేందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందట. అలాగే ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించడం విశేషం. గర్భం దాల్చడం.. పిల్లలకు జన్మనివ్వడమే నా పని అంటూ మార్తా వెల్లడించింది. గవర్నమెంట్ పెద్ద పిల్లలకు $76, చిన్న పిల్లలకు $30. 50 సహాయం చేస్తుందట. మార్తా సర్కారు నుంచి $510 మాత్రమే అందుకున్నప్పటికీ తనపై పలు ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మార్తా..19 మంది పిల్లలతో 3 బెడ్‌రూమ్‌లు ఉన్న ఇంట్లో నివాసం ఉంటుంది.
ఇంట్లో ఎక్కువగా ప్లేస్ లేకపోవడంతో పెద్ద పిల్లలు సోఫాలో నిద్రిస్తారని చెప్పింది. నాకు నా పిల్లలకి ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ ఆ డబ్బు మాకు సరిపోదని చెప్పుకొచ్చింది. పిల్లలకు నాణ్యత గల ఫుడ్ ఇవ్వడం కూడా తరచూ సాధ్యం కాదని.. స్థానికులు, ఇరుగుపొరుగు వారు సహాయం చేస్తారని, పిల్లల తండ్రులందరూ అస్సలు పట్టించుకోవడం లేదని కంప్లైంట్ కూడా ఇచ్చానని మార్తా వెల్లడించింది.
ఈ వార్త వీక్షించిన జనాలు తెగ కన్ఫూజన్‌లో పడిపోయారు. ‘ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం ఏంటి? దీనికి ప్రభుత్వం అనుమతించడం ఏంటి? అని కొంతమంది కామెంట్స్ చేయగా.. మరికొంతమంది.. ఈమెకు ఇదేం కర్మరా బాబు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.