కరోనా నేర్పిన గుణపాఠం

by Anukaran |
కరోనా నేర్పిన గుణపాఠం
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : మరక కూడా మంచిదే అనేలా కరోనాతో సమాజానికి చెడు మాత్రమే కాదు మంచి కూడా జరుగుతుంది. ఇదేమిటి కరోనా బారిన పడి లక్షలాది మంది ఆస్పత్రుల పాలవుతుండగా మంచి ఏం జరిగింది అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో తలెత్తక మానదు. అవును మీరు చదువుతున్నది నిజమే. కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో నగరంలో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పరిశుభ్రతకు ఎక్కవు ప్రాధాన్యమిస్తున్నారు. ముఖానికి మాస్కు పెట్టుకోవడంతో పాటు వేడి నీళ్లు తాగుతున్నారు. శుభ్రమైన వేడి వేడి ఆహారం తీసుకుంటున్నారు. దీంతో రోగ నిరోధక శక్తి పెరి గింది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వేలాది మంది సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారు. హాస్పిటల్స్ లో మంచాల కొరత కూడా తీవ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు కరోనా జాగ్రత్తలు పాటిస్తుండడంతో విష జ్వర పీడితుల కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.

ప్రజల్లో పెరిగిన అవగాహన…

కరోనాతో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇంటి భోజనం చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధులు సోకడం లేదు. కాచి వడబోసిన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్‌, పచ్చకామెర్లు వంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో ఫీవరాసుపత్రికి సీజనల్‌ వ్యాధులతో వచ్చినవారి సంఖ్య తక్కువేనని అధికారులు చెబుతున్నారు.

నిర్లక్ష్యం చేస్తే….

ప్రతి ఏడు వర్షాల కా లం విషజ్వరాలు ప్రబ లే విషవ్యాధుల ప్ర భావం ఈ ఏడు అంత గా కన్పించనప్పటికీ వ్యాధుల ప్రభావం పూర్తిగా లేకుండా పోలేదు. ఇటీవల నగరంలో కురిసిన వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. దోమలు పెరిగాయి, నీరు కలుషితమై సీజ నల్‌ వ్యాధులు పంజా వి సిరే ముప్పు పొంచి ఉంది. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి దాడి చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

ఒకేలా వైరల్‌ జ్వరాలు, కరోనా లక్షణాలు..

వైరల్‌ ఫీవర్ లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొ ప్పులు, కొందరిలో విరేచనాలు అవుతుంటాయి. కరో నా లక్షణాలు కూడా ఇలానే ఉండటంతో గుర్తించడం చాలా కష్టమని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. జబ్బు లక్షణాలను బట్టి వైరల్‌ జ్వరాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే కొందరిలో ఆరోగ్యం విషమంగా మారుతోంది. జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉంటే తొలుత కరోనా పరీక్ష చేయించుకోవాలి. ర్యాపిడ్‌ యాంటిజెన్‌లో నెగిటివ్‌ వచ్చినా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. అందులోనూ నెగిటివ్‌ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే వైద్యులను తప్పక సంప్రదించి వైద్య చికిత్సలు పొందాలి.

రోగ నిరోధక శక్తి తగ్గితే వైరల్ ఫీవర్స్ -డాక్టర్ పుట్లా శ్రీనివాస్

కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగానే ఉండాలి . వర్షాల కారణంగా వాతావరణం లో మార్పులు చోటు చేసుకుని చాలా మంది వైరల్ ఫీవర్‌‌తో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైరల్ ఫీ వర్ అని తెలియగానే భయపడి పోయి యాంటీ బయాటిక్స్ వాడుతు న్నారు.అయితే, రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే వైరల్ ఫీవర్స్ మనపై దాడి చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed