ఆ గ్రామంలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు..

by Anukaran |   ( Updated:2021-06-12 01:06:43.0  )
leopard hunts a pet dog
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశంలో రోజూ చిరుతపులుల దాడి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటిముందు నిద్రిస్తున్న కుక్కను చిరుత ఎత్తుకెళ్లిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. మహరాష్ట్రలోని భూసే అనే గ్రామంలో అర్థరాత్రి వేళ ఇంటిముందు పడుకున్న పెంపుడు కుక్కను చిరుతపులి నోటికి కరుచుకొని ఎత్తుకెళ్లిన దృశ్యాలు చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు విన్నవించగా, ఆ గ్రామంలో భారీ బందోబస్తు మోహరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story