కొండపాక రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత సంచారం

by Shyam |
Leopard, kondapaka reserve forest
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కొండపాక రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత కలకలం రేపింది. మల్లన్న సాగర్ జలాశయాన్ని ఆనుకొని ఉన్న ఫారెస్ట్‌లో ఓ బండరాయి పక్కనే నక్కిన చిరుతను అటవీశాఖ సిబ్బంది గుర్తించి, ఫోన్లలో ఫొటోలు తీశారు. నల్లజుట్టు గల చిరుతపులి(పాంథర్)గా అటవీశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది అంకిరెడ్డిపల్లి చెరువు వద్ద ఒక చిరుత ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతం రెండు చిరుతలు అడవిలో సంచరిస్తున్నాయని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు తమకు కనిపించాయని వెల్లడించారు. అంకిరెడ్డిపల్లి చెరువు సమీపంలో సంచరించే చిరుతలు అప్పుడప్పుడు అటవీ సరిహద్దులకు వస్తున్నాయన్నారు. సమీప అటవీ ప్రాంతాలకు సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కొండపాక రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లవద్దని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story