- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎవ్రీ వన్ ఈజ్ ఆసమ్’ పేరుతో.. ఎల్‌జీబీటీ లెగో సెట్ లాంచ్
దిశ, ఫీచర్స్ : ‘గే ప్రైడ్’ లేదా ‘ఎల్‌జీబీటీ ప్రైడ్’ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్, సమానత్వం, డిగ్నిటికి ప్రతీక. సమాజంలో పెరుగుతున్న లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ‘ఎల్‌జీబీటీ’ కమ్యూనిటీ గురించి అవగాహన పెంచుకుంటూ.. హోమోఫోబియాను దూరం చేస్తూ, ప్రతి విషయాన్ని అందరితో ధైర్యంగా చర్చించుకునే నెలనే ‘ప్రైడ్ మంత్’గా అభివర్ణిస్తారు. ఈ సమూహం జూన్ నెలలో జరుపుకునే ‘ప్రైడ్ మంత్’ సందర్భంగా ద లెగో గ్రూప్ ‘ఎల్‌జీబీటీక్యూ’ థీమ్ ‘ఎవ్రీ వన్ ఈజ్ ఆసమ్’ పేరుతో లెగో సెట్‌ను లాంచ్ చేసింది.
లెగో ఆన్‌లైన్ స్టోర్‌లోకి జూన్ 1న వస్తున్న ఈ స్పెషల్ లోగో సెట్‌లో 11 మోనోక్రోమ్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, రెయిన్‌బో రంగులతో ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. సెట్‌లోని రంగులు రెయిన్‌బో జెండాతో ప్రేరణ పొందగా.. ఈ సెట్‌లో నలుపు, గోధుమ రంగులు “LGBTQIA + కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరి విస్తృత వైవిధ్యాన్ని సూచించడానికి లేత నీలం, తెలుపు, గులాబీ రంగులు లింగమార్పిడి సంఘాన్ని సూచిస్తాయి. ఇక కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపనీ వైల్డ్ బ్రెయిన్, అండ్ గ్లాడ్(ప్రపంచంలోనే అతిపెద్ద LGBTQ మీడియా న్యాయవాద సంస్థ )లు సంయుక్తంగా ‘టెలీబబ్బీస్’ ఫ్యాషన్ అప్పియరెల్‌ను లాంచ్ చేశాయి.
‘సమూహానికి ప్రతీకగా ఉన్న నమూనాను సృష్టించాలనుకున్నాను. వాళ్లను ఎలా గుర్తిస్తున్నారు, ఎంతమంది వారిని ప్రేమిస్తున్నారనేది పక్కన పెట్టి ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే విషయం. ఎవ్రీ వన్ ఈజ్ ఆసమ్ అన్నది గుర్తుంచుకోవాలి. సమాజంలో మనమంతా ఒకటిగా ఒకరికొకరు మద్దతు చూపించాలన్నదే నా అభిప్రాయం. ప్రేమ అంగీకారాన్ని వ్యాప్తి చేయడానికి బంధువులు, స్నేహితులకు ఈ సెట్ బహుమతిగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.
1980లలో స్వలింగ సంపర్కుడిగా ఉండటం ఎంతో దయనీయం. ఆ సమయంలో ప్రబలిన హోమోఫోబియా కారణంగా మా జీవితాలు చాలా భయంకరంగా, భయానకంగా ఉండేవి. కాలక్రమేణ సమాజంలో మార్పులు ఇంకా రావాల్సి ఉంది. నేను పెరిగేటప్పుడు నాకు ఇలాంటి సెట్ ఇచ్చి ఉంటే, నన్ను ప్రోత్సహిస్తున్నారని, గుర్తిస్తున్నారనే భావన నాలో చాలా ఉపశమనం కలిగించేది. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి మీ కోసం ఎప్పుడూ ఇక్కడే ఉంటాను’
ఆష్టన్, లెగో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్.