- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకు కోసం కోడింగ్!
దిశ, వెబ్‌డెస్క్: ఈరోజుల్లో ప్రతి చిన్న ఈవెంట్‌కు, ప్రతి చిన్న దుకాణానికి వెబ్‌సైట్ ఉండటం కామన్‌గా మారింది. అలాగే వెబ్‌సైట్ డిజైన్ చేసే వాళ్లు కూడా విరివిగా ఉన్నారు. చెన్నైకి చెందిన 25 ఏళ్ల ప్రేమ్ శంకర్ కూడా ఒక వెబ్ డిజైనర్. ఇప్పటికే నాలుగైదు వెబ్‌సైట్‌లను కూడా డిజైన్ చేశారు. ఇందులో గొప్పేముంది.. 14 ఏళ్లు నిండకముందే ఇరవై, ముప్పై వెబ్‌సైట్‌లు డిజైన్ చేసినవాళ్లు ఎందరో ఉన్నారని పెదవి విరవకండి. ఎందుకంటే ప్రేమ్ అందరిలాంటి వాడు కాదు. అతనికి చిన్నతనం నుంచే ఆటిజం స్పెక్ర్టమ్ వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు దేన్నీ సరిగా అర్థం చేసుకోలేరు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పినపుడే మాత్రం ఒక అంశం గురించి వారికి అవగాహన వస్తుంది. అలాగే ఒక్కో అంశాన్ని ఒక్కో రకంగా చెప్పాల్సిఉంటుంది. అలాంటి ప్రేమ్ ఇప్పుడు వెబ్‌సైట్ డిజైనర్‌గా కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నాడు.
సాధారణంగా ఆటిజం ఉన్న వారు మెయిన్ స్ట్రీమ్ ఉద్యోగాలకు పనికిరారని సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని ప్రేమ్ తిరగరాశాడు. అందుకు అతని తల్లి మంగై అల్వార్ చేసిన పని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉద్యోగరీత్యా ఆమె ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌గా పనిచేస్తోంది. ప్రేమ్ 20 ఏళ్ల వయస్సులో ప్రత్యేక అవసరాల వారి పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాక, ఆటిజం సమస్య ఉన్నవారి కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఉద్యోగ మేళాకు హాజరయ్యాడు. అక్కడ మను శేఖర్ అనే వ్యక్తి, మంగై అల్వార్‌ను కలిసి ప్రేమ్ కోడింగ్ నేర్చుకోగలడనే నమ్మకాన్ని నింపాడు. అయితే సంక్లిష్టంగా ఉండే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కోడింగ్‌ను ప్రేమ్ లాంటి వాళ్లు నేర్చుకోవాలంటే కష్టమే, అందుకే ముందు ఆ కోడింగ్‌ను మంగై నేర్చుకుని, వాటిని తన కొడుక్కు అర్థమయ్యే రీతిలో చెప్పేది. అలా సంవత్సరం తిరిగేసరికి తల్లీకొడుకులు కోడింగ్ నేర్చేసుకున్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్లకు, కంపెనీలకు ప్రేమ్, మంగై కలిసి వెబ్‌సైట్‌లను డిజైన్ చేస్తున్నారు. ఏదేమైనా ‘సంకల్ప బలం ముందు విధిరాత చిన్నదే’ అని ప్రేమ్ లాంటి వాళ్లు నిరూపిస్తున్నారు. మనం కూడా మన వంతు సాయంగా వాళ్లకు పని కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మీకు ఏదైనా వెబ్‌సైట్ అవసరం ఉంటే codewithprem.in వెబ్‌సైట్ ద్వారా ప్రేమ్‌ను సంప్రదించవచ్చు.