నాయకత్వ ఎన్నికలు నిర్వహించాలి : శశిథరూర్

by Shamantha N |
నాయకత్వ ఎన్నికలు నిర్వహించాలి : శశిథరూర్
X

రాహుల్ గాంధీకే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ మాజీ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ‘నాయకత్వ ఎన్నికలు’ నిర్వహించాలని ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరారు. నాయకత్వ సమస్యలపై కాంగ్రెస్‌లో నెలకొన్న నిరుత్సాహం, నిశ్శబ్దం పట్ల పార్టీ అగ్రనాయకత్వాన్ని ప్రశ్నిస్తూ.. మాజీ ఎంపీ, షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన విషయాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న మాజీ సీఎంలతో పాటు ప్రస్తుతం సీఎంలుగా ఉన్న సీనియర్ నాయకులు పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని దీక్షిత్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. కాగా ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీలోనే అంతర్గతంగా చర్చ మొదలైంది. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ సైతం పార్టీ పరిస్థితిపై స్పందించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed