- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు
దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలంలోని భీంపల్లి, మాదన్నపేట గ్రామాలలో గురువారం ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ పర్యటించారు. వారికి మాదన్నపేట గ్రామంలోని దళితులు మంగళ హారతులతో, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని దళితుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళితులు ఆర్థికంగా బలోపేతం మరియు ఎదగడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల ఇన్చార్జి పేరియాల రవీందర్రావు, తక్కలపెల్లి సత్యనారాయణ రావు, ప్రదీప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- kamalapuram