ప్రజా సమస్యలపై చర్చకు రారా.. అధికారులపై నాయకుల ఆగ్రహం

by Shyam |
ప్రజా సమస్యలపై చర్చకు రారా.. అధికారులపై నాయకుల ఆగ్రహం
X

దిశ, వర్ని: ప్రజా సమస్యలపై చర్చకు రారు.. సమస్యలపై స్పందించారు.. ప్రజా ప్రతినిధులంటే పట్టింపు లేదు. మండల సమావేశం అంటే చిన్న చూపు.. మీరు మారరా.. మిమ్మల్నే మార్చమంటారా?.. అంటూ చందూర్ మండల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అధికారులను హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి కొందరు మండల అధికారులు హాజరుకాకుండా కింది స్థాయి అధికారులను పంపించారు.

దీనిపై మండల వైస్ ఎంపీపీ దశ గౌడ్ అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మండల అధికారులు కాకుండా కిందిస్థాయి సిబ్బందిని సమావేశానికి పంపించడం సరికాదన్నారు. తమ సూచనలను పట్టించుకోకుండా మండల అధికారులు ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. గతంలో సభ ఆదేశించిన ఆదేశాలను అధికారులు పెడచెవిన పెట్టడం సభను, సభ్యులను అగౌరపరచడమే అవుతుందన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకుని మరుసటి సమావేశానికి అధికారులు హాజరు కావాలని హెచ్చరించారు. లేదంటే సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేసి, వారిని మార్చడానికి వెనకాడబోమన్నారు. అలాగే మండలంలో నెలకున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story