పెండింగ్ పనులు పూర్తి చేయండి

by Shyam |
పెండింగ్ పనులు పూర్తి చేయండి
X

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తిచేసి, నూతన అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు విజయకృష్ణ, మారుతి దివాకర్, హరికృష్ణయ్య, వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ ప్రసాద్, డీజీఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story