- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. వాయిదానా! ఉత్తర్వులా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సుప్రీంలో వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనున్నది. ఈడీ నోటీసులను రద్దు చేయాలని, మహిళగా తనను ఇంట్లోనే విచారించాలని వేసిన పిటిషన్ జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందుకు రానున్నది. అయితే విచారణ జరిగిన వెంటనే ధర్మాసనం ఉత్తర్వులను జారీచేస్తుందా? లేక వాయిదా వేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, గతంలో మనీష్ సిసోడియా పిటిషన్ పై ఒక్క రోజులోనే తేల్చేసిన సుప్రీం, హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇప్పుడు కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. కాగా, కవిత పిటిషన్‌కు అనుబంధంగా ఈడీ కూడా కేవియట్ దాఖలు చేసింది. ఈడీ తరపున వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
నాలుగు కేసుల వివరాలు జత
గతంలో శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో నళినీ చిదంబరానికి ఈడీ నోటీసులు జారీచేసింది. మహిళగా తనను ఇంట్లోనే విచారించాలంటూ మద్రాసు హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిగింది. చివరకు గతేడాది అక్టోబరు 17న సుప్రీంకోర్టు విచారించి తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో ఆమె పేర్కొన్న అంశాలతోపాటు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఓరల్‌గా వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా కవిత తరఫు న్యాయవాది లేవనెత్తనున్నారు.
అంతేకాకుండా నళినీ చిదంబరం ఇష్యూతోపాటు ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన మనీష్ సిసోడియా పిటిషన్, పరంవీర్ సింగ్ షైనీ వర్సెస్ బల్జీత్ సింగ్ స్పెషల్ లీవ్ పిటిషన్ లోని అంశాలను కూడా న్యాయవాది ప్రస్తావించనున్నారు. ఈ పిటిషన్ పై గత నెల 21న విచారణ జరగ్గా, తదుపరి వచ్చే నెల 18న కంటిన్యూ కానున్నది. చివరకు ఢిల్లీ కన్జ్యూమర్ కోఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్ కర్మచారి యూనియన్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ లోని అంశాలను కూడా న్యాయవాది లేవనెత్తనున్నారు. కాగా, ఈ పిటిషన్‌ను 2021 నవంబరు 15న సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోఆపరేటివ్ స్టోర్స్ కర్మచారి యూనియన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వెలువరించిన అంశాలను కవిత తన తాజా పిటిషన్ విచారణ సందర్భంగా వర్తించేలా వాదనలను వినిపించనున్నారు.
ఈడీ వాదనలపై ఆసక్తి..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ కోణం నుంచి దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటికే స్పెషల్ కోర్టులో పలువురిని హాజరుపరిచిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 80% మేర ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని, సౌత్ గ్రూప్ ప్రమేయం కారణంగానే ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో టాక్స్ స్ట్రక్చర్‌లో మార్పులు జరిగాయని స్పెషల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. భారీ స్థాయిలో లెక్కల్లోకి రాని డబ్బు హవాలా మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరిందని పలువురి స్టేట్‌మెంట్లలోని అంశాలను చెప్పింది. కొద్దిమందితో జాయింట్ ఎంక్వయిరీ (కన్‌ఫ్రంటేషన్) చేయాల్సి ఉన్నదని పేర్కొన్నది.
ఇలాంటి పరిస్థితుల్లో కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగే సమయంలో ఈడీ ఎలాంటి అంశాలను తెరపైకి తెస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మనీష్ సిసోడియా పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఒకే రోజున తేల్చివేసినట్లుగా కవిత పిటిషన్ విషయంలోనూ సుప్రీం ఉత్తర్వులు వెలువడతాయా..? ఈడీ దర్యాప్తులో జోక్యంపై కీలక కామెంట్లు చేస్తుందా?.. లేక నళినీ చిదంబరం స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ ఎలాగూ వచ్చే నెల 5న ఉన్నందున అప్పటికి వాయిదా వేస్తుందా? అనే చర్చలు జరుగుతున్నాయి. అప్పటివరకూ కవితకు ఈడీ వైపు నుంచి ఎంక్వయిరీకి హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ అవుతాయా?.. లేక సుప్రీంకోర్టు దీనిపై స్పష్టతకు వచ్చి ఉత్తర్వులు జారీచేసేంత వరకు ఇంటెరిమ్ రిలీఫ్ లాంటివి వస్తాయా? అనే వాటిపై ఉత్కంఠ నెలకొన్నది.