ఏఎస్సైలుగా నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

by Shyam |
ఏఎస్సైలుగా నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి
X

దిశ, నల్లగొండ : ప్రజలలో పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా బాధితులకు బాసటగా నిలిచి పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం కలిగే విధంగా విధి నిర్వహణ చేయాలని ఎస్పీ రంగనాధ్ పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు సూచించారు. శుక్రవారం ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన తూడి సుధాకర్, సట్టు వెంకటగిరి, ఎం.డి. గౌస్ లను ఎస్పీ అభినందించారు. ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ లభించిన పదోన్నతి ద్వారా పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధిత ప్రజలకు న్యాయం అందించేలా పని చేయడం ద్వారా ప్రజల అభిమానం పొందాలన్నారు.

విధి నిర్వహణ క్రమంలో పదోన్నతి ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని, ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించి వారి అభిమానం పొందాలని సూచించారు. పోలీస్ అధికారులు తమకు లభించిన పదోన్నతిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు సేవ చేసే విధంగా, అనేక రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం అందిస్తూ మంచి పేరు పొందాలన్నారు. ప్రజాభిమానం పొందేలా పనిచేస్తూ ముందుకు సాగాలని, తద్వారా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజలలో మరింత పెంచేలా విధి నిర్వహణ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులున్నారు.

Advertisement

Next Story