- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయసాయిరెడ్డి లేఖను అలా పరిగణించట్లేదు
దిశ, అమరావతి బ్యూరో: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖను తాను షోకాజ్ నోటీసుగా పరిగణించడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. విజయసాయిరెడ్డి క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షులా? అని నిలదీశారు. ఆయననే తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి లేఖకు తాను రిప్లై ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సాయిరెడ్డి తనను అడిగారని, మేనిఫెస్టోలో పెట్టారో లేదో తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి మాత్రమే రిప్లై ఇచ్చినట్లు వెల్లడించారు. సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. లేఖలో నిజానిజాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. లేఖ చేరాక.. మాట్లాడే అవకాశం ఇస్తే వ్యక్తిగతంగా సీఎంను కలిసి తన సమస్యలు చెప్పుకుంటానని స్పష్టం చేశారు. తన ఫ్రెండ్ సంగీత దర్శకుడని, ఆయన పంపిన పాటనే సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రధాని మోదీపై ఉన్న గౌరవంతోనే సాంగ్ విడుదల చేశానన్నారు.
తాను వెంకటేశ్వరస్వామి అపర భక్తుడినని, శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలనే వివరించానని తెలిపారు. శ్రీవారి ఆస్తుల అమ్మకంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పనన్నారు. టీటీడీ నిర్ణయాలను తాను ఎక్కడా వ్యతిరేకించలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణా సంఘమే నోటీసులు ఇవ్వాలని తెలిపారు. తన లేఖ పట్ల జగన్ సంతృప్తి పొందుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మద్యం తాగి ప్రధానిని, సీఎంను కలిశానని అసహ్యంగా రాశారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు తన గురించి రాస్తే ప్రివిలేజ్‌కు పంపే అధికారం లేదా? అని ప్రశ్నించారు. ఇసుకలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజల సమస్యనే తెలిపానని అన్నారు. అక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడాకే తనూ స్పందించానని చెప్పారు. సీఎంకు నేను పంపింది వర్తమానం మాత్రమేనని పార్టీకి, సీఎంకు వ్యతిరేకంగా తాను ఎక్కడా మాట్లాడలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు.