హత్తుకోవడం లేదు.. ముద్దు పెట్టుకోవడం లేదు

by Shyam |   ( Updated:2020-07-22 02:03:41.0  )
హత్తుకోవడం లేదు.. ముద్దు పెట్టుకోవడం లేదు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాతో అన్ని రంగాలవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారు కరోనా కోరలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాగ్రత్తల్లో భాగంగా కొందరు తీసుకుంటున్న జాగ్రత్తలు బాధకరంగా ఉన్నా తప్పడంలేదు. ఇందుకు సంబంధించి ప్రముఖ నటి రూపాలి గంగూలీ గురించి ఓ అంశం చర్చకు వచ్చింది. అదేమిటంటే.. ‘షూటింగ్‌ నుంచి వచ్చాక నా కొడుకు రుద్రాన్ష్‌ను హత్తుకోవడం లేదు. ముద్దు పెట్టుకోవడం లేదు. అతనికి నేను వీలైనంత దూరంగా ఉంటున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది. కానీ, తప్పడంలేదు ఎందుకంటే కారోనా. ఒకరోజు నా కొడుకు ‘అమ్మా.. నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఇంకో ఆరు నెలలు ఆగాలా’ అని అడిగాడు. అది విని నా గుండె బద్దలయ్యింది. కానీ, ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం నేను దూరంగా ఉన్నందుకు నా కుమారుడు బాధపడతాడేమో కానీ భవిష్యత్తులో నా నటన చూసి చాలా గర్వపడతాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story