నాటు బాంబులతో వ్యక్తి వీరంగం.. భయంతో స్థానికుల పరుగులు

by srinivas |   ( Updated:2021-08-09 22:51:29.0  )
Landmine exploded
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబులు కలకలం రేపాయి. మద్యం మత్తులో కృష్ణయ్య అనే వ్యక్తి పది నాటు బాంబులతో మంగళవారం తెల్లవారుజామున వీరంగం సృష్టించాడు. ఈ గందరగోళంలో ఓ నాటు బాంబు పేలింది. భయాందోళనతో స్థానికులు పరుగులు తీయంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పరారైన నిందితుడు కృష్ణయ్య కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story