- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కబ్జాదారుడెవరు.. కమిషనర్ వాట్సాప్ మెసేజ్ వైరల్
దిశ, ఆందోల్: ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీ కమిషనర్ వాట్సాప్ మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారాన్ని పత్రికలు, టీవీ చానళ్ల ప్రతినిధులు ఉన్న వాట్సాప్ గ్రూపులో శుక్రవారం పోస్ట్ చేశారు. అందులో ‘దౌర్జన్యంగా ఒక పట్టా భూమిని ఆక్రమించి, అనుమతి లేకుండా ఇంటిని నిర్మిస్తూ.. ఏ వ్యవస్థ నన్నేం చేయలేదు’ అని పోస్ట్ చేశారు. అంతేగాకుండా తమ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అందరికీ ఒకేలా న్యాయం ఉంటుందని హెచ్చరిస్తూ పోస్ట్ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఎవర్ని ఉద్దేశించి పోస్ట్ చేశారంటూ, ఆ వ్యక్తి ఎవరు అంటూ స్థానికంగా చర్చ జోరుగా జరుగుతోంది. కాగా, అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కమిషనర్ మెసేజ్‌తో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిలో ఆందోళన మొదలైందని చెప్పవచ్చు.