యువతి అదృశ్యం

by Sumithra |
యువతి అదృశ్యం
X

హైదరాబాద్‌లో గుంటుూరుకు చెందిన ఓ యువతి అదృశ్యమైంది.
ఈ ఘటన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..లోతుకుంట సరస్వతి నగర్‌లో నివాసముంటున్న వేల్పుల రాబర్ట్ జయ ప్రకాష్‌రావు ఇంట్లో మూడేండ్ల నుంచి గుంటూరు జిల్లాకు చెందిన విజయ(21)వంట పనిచేస్తోంది.ఇటీవల ఇంట్లో నుంచి బయటకెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఇంటి యజమాని జయ ప్రకాష్ రావు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story