- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ల్యాబ్ టెక్నిషియన్ మృతి.. కారణంఅదే
దిశ, హుజురాబాద్: కరోనాతో ల్యాబ్ టెక్నిషియన్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న శ్రీ రామకృష్ణకి కొన్ని రోజులక్రితం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయనను వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాని పరిస్థితి విషమించడంతో ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారినపడి రామకృష్ణ చనిపోవడంతో తెలంగాణ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిలో నిరంతరం శ్రమిస్తూ కరోనా సోకడంతో చనిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్యూటీలో కరోనాతో మరణిస్తున్న వారిలో ల్యాబ్ టెక్నీషియన్లు ఎక్కువగా ఉన్నారన్నారు. అలానే మౌళిక సౌకర్యాలు కల్పించలేకపోవడం వల్లే కరోనా బారిన పడుతున్నామని రాష్ట్ర కమిటి పేర్కొంది. ఇప్పటికైనా ల్యాబ్ టెక్నిషియన్లు టెస్ట్ లు చేస్తున్న క్రమంలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంఘం కోరింది.