- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ ఎఫెక్ట్.. కన్ఫ్యూజన్‌లో కూన శ్రీశైలం గౌడ్
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ డైలామాలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు లేడని, ఎవరికి వారే ముఖ్యమంత్రిగా చెప్పుకుని పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలతో నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు బీజేపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతీ కార్యక్రమాన్ని శ్రీశైలం ముందుండి నడిపించారు. దుబ్బాక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం సుమారు 15 రోజులు పాటు అక్కడే మకాం వేశారు. కానీ, అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి బీజేపీ అభ్యర్థి గెలుపొందడంతో పాటు పార్టీ పెద్దల వ్యవహారం నచ్చకపోవడంతో శ్రీశైలం గౌడ్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
వేధిస్తున్న సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటములు..
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూన శ్రీశైలంగౌడ్ ఇన్‌చార్జీగా వ్యవహరించగా అక్కడి బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. అదే విధంగా పట్టభద్రుల ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమి చెందడంతో ఆయన భవితవ్యం మీమాంసలో పడినట్టు అయింది. బీజేపీ కాకుంటే టీఆర్ఎస్‌లో చేరాలనుకుంటే కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌లకు కాకుండా ఇతరులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో, ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.
మారిన రాజకీయ సమీకరణాలు..
ఇదిలా ఉండగా ఏఐసీసీ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో కూన శ్రీశైలంగౌడ్‌తో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా డైలమాలో పడ్డారని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్‌కు బలమైన నాయకులు లేకపోవడం, బీజేపీలో ఇప్పటికే కొలన్ హన్మంత్ రెడ్డి ఉండటం ప్రతికూలంగా మారింది. దీంతో, కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరితే శ్రీశైలం విజయం తథ్యమని చర్చించుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరితే చివరకు రేవంత్ రెడ్డి ఛరిష్మాతోనైనా గెలిచి తీరొచ్చని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూన కాంగ్రెస్ పార్టీలో చేరితేనే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. శ్రీశైలం గౌడ్ మాత్రం ఈ విషయాన్ని ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.