బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ నేత

by Ramesh Goud |   ( Updated:2021-06-10 09:48:23.0  )
congress patolla Nagireddy
X

దిశ, కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పటోళ్ల నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం సమక్షంలో నాగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నాగిరెడ్డికి కండువ కప్పి సత్యం శ్రీరంగం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ.. మోడీ పాలనకు విసుగు చెంది నాగిరెడ్డి తిరిగి తన సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్​పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకుంటూ, కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎంపీ రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

Next Story