- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిశ్రమలకు అండగా నిలుస్తాం: మంత్రి కేటీఆర్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం ఫిక్కీ ఆధ్వర్యంలో ‘రీబిల్డింగ్ అండ్ రీబూటింగ్ తెలంగాణ ఎకానమీ పోస్ట్ కోవిడ్ 19’ పేరుతో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కరోనా పరిస్థితుల తర్వాత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు సాగించాలనే అంశాలపైన ప్రసంగించారు. లాక్‌డౌన్ పరిస్థితులు ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలోని అన్నిరకాల పరిశ్రమలకు అండగా నిలుస్తున్నామని వివరించారు. లాక్‌డౌన్‌లోనూ లైఫ్ సైన్సెస్ వంటి అత్యవసర సేవల కంపెనీలకు, పరిశ్రమలకు తమ కార్యకలాపాలు కొనసాగించే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో షాపులు, కంపెనీలను ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. అటు కంపెనీలతో పాటు ప్రజలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తుందన్నారు. కరోనా పోరులో పౌరులు ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయమిదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్యతరహా కంపెనీలను(ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు అవసరమైన చర్యలను చేపట్టామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి వారిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వం తరఫున కోరినట్లు తెలిపారు.
ఎంఎస్ఎంఈలకు విద్యుత్ బిల్లులతో పాటు, ఆస్తి పన్ను విషయంలో పలు రకాల వెసులుబాటు కల్పించినట్లు మంత్రి వివరించారు. చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలను ఆకర్షించడంతో పాటు హెల్త్‌కేర్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్నారు. హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను ప్రస్తుత సంక్షోభం తెరపైకి తీసుకువచ్చిందన్నారు. మెడికల్ డివైసెస్ తయారీ వంటి నూతన రంగాల్లో రాష్ట్రం ఇప్పటికే చురుగ్గా ముందుకు పోతుందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలకు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వెబినార్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారు.