నేడు కంకోల్‌కు మంత్రుల రాక.. వాటిని ప్రారంభించనున్న కేటీఆర్..

by Shyam |
ktr
X

దిశ, మునిపల్లి: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌లో గల woxsen బిజినెస్ యూనివర్సిటీకి రాష్ట్రమంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు హాజరవుతున్నట్లు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కంకోల్ woxsen యూనివర్సిటీ‌ని క్రాంతి కిరణ్ సందర్శించారు. మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంకోల్ woxsen యూనివర్సిటీ‌లో నూతనంగా నిర్మాణం చేపట్టిన లైబ్రరీ బ్లాక్, క్లాస్ రూమ్ బ్లాక్, బ్లూమ్బర్గ్ బ్లాక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ గదులను ప్రారంభించేందుకు మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వారణాసి సతీష్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, కంకోల్ సర్పంచ్, నాయకులు, శివశంకర్, woxsen యూనివర్సిటీ అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story