సైలెన్స్ బ్రేక్ చేసిన కేటీఆర్.. ఈటల అంశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Sridhar Babu |   ( Updated:2021-07-14 04:39:07.0  )
KTR-and-etela-rajender
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఈటల రాజేందర్‌ భూ కబ్జా ఆరోపణల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ ఈటలను మంత్రి నుంచి, పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు. అనేక రాజకీయ పరిణామాల తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అయితే, ఇప్పటి వరకు ఈటల రాజేందర్ విషయంలో సైలెంట్‌గా ఉన్న కేటీఆర్.. బుధవారం స్పందించారు.

ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ.. ఈటల టీఆర్ఎస్‌లో ఉండేందుకు చివరి వరకు ప్రయత్నించానని అన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఈటల తప్పుబట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఐదేళ్ల నుంచి గ్యాప్ ఉంటే కేబినెట్‌లో ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. ఈటల అడ్డంగా మాట్లాడినా కేబినెట్‌లో కేసీఆర్.. ఆయనను కొనసాగించారని పేర్కొన్నారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నష్టం చేయలేదని, 2003లో ఎంత కష్టమైనా పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు చేశారని మండిపడ్డారు.

మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అక్కడే మాట్లాడితే పోయేదని, సానుభూతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి ఆయనకు ఆయనే దూరం అయ్యారని చెప్పారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంత చేసిందో ఆత్మ విమర్మ చేసుకోవాలని అన్నారు. ఈటల రాకముందు కూడా కమలాపూర్‌లో టీఆర్ఎస్ బలంగా ఉంది. అనామకుడు ఉత్తరం రాస్తే ఈటలపై చర్యలు తీసుకోలేదు. ఈటల రాజేందర్‌ది ఆత్మవంచన అని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యే పోటీ అని వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల్లో న్యాయమే గెలుస్తుందని అన్నారు.

Follow Dishadaily Official Facebook page

Advertisement

Next Story

Most Viewed