శ్రీశైలం ఘటనపై కేఆర్ఎంబీ విచారం

by Shyam |
శ్రీశైలం ఘటనపై కేఆర్ఎంబీ విచారం
X

దిశ, న్యూస్‌బ్యూరో: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(KRMB) విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం తమను కలిచి వేసిందని బోర్డు సభ్యుడు(విద్యుత్) ఎల్.బీ మౌంతాంగ్ పేర్కొన్నారు. ఈ మేరకు టీఎస్ జెన్కో (హైడల్) డైరెక్టర్‌కు ఆయన సోమవారం ఒక లేఖ రాశారు. శ్రీశైలం ఘటనపై జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపడానికిగాను తమకు ఒక నివేదిక అందజేయాల్సిందింగా కేఆర్ఎంబీ సభ్యుడు కోరారు.

Advertisement

Next Story