- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిలిచిపోయిన క్రాక్ సినిమా విడుదల
దిశ, వెబ్‌డెస్క్: రవితేజ అభిమానులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్న క్రాక్ మూవీ రిలీజ్‌కు బ్రేకులు పడ్డాయి. ఆర్థిక వివాదం నేపథ్యంలో తమిళ వర్షన్ ఎర్లీ మార్నింగ్ షో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకపోవడంతో.. చిత్ర నిర్మాత మధు చెన్నై ఫైనాన్షియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక ఉదయం 11 గంటల షోతో అయిన క్రాక్ తెర మీదకు వస్తుందో లేదో అన్న సందేహంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో పడ్డారు. క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వద్దామనుకుంటున్న రవితేజకు ఈ వ్యవహారం కాస్త ఇబ్బంది కలిగించినట్టు అయిందనే చెప్పాలి.
డిస్ట్రీబ్యూటర్‌లకు చెల్లించాల్సిన పాత డబ్బులు ఇవ్వకుండా.. నిర్మాత మధు క్రాక్ సినిమాను ఎలా విడుదల చేస్తారని ఓ తమిళ డిస్ట్రీబ్యూటర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సినిమా ఎర్లీ మార్నింగ్ షో నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన చిత్ర నిర్మాత సంబంధిత డిస్ట్రీబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.