‘కోవిద సహృదయ’ సేవలు స్ఫూర్తిమంతం

by Shyam |
‘కోవిద సహృదయ’ సేవలు స్ఫూర్తిమంతం
X

దిశ , హైదరాబాద్: కరోనా సమయంలో పేదల కడుపు నింపుతున్న కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అనూహ్య రెడ్డి అభినందనీయురాలు అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీరాఘవులు కొనియాడారు. శనివారం ఆబిడ్స్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆపద కాలంలో అండగా నిలుస్తున్న ఆమె సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ మాట్లాడుతూ.. జాతీయ భావాలు, దేశభక్తి కలిగిన ఆమె ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ పేదలకు మరింత అండగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story