‘కొండపోచమ్మ’ సిగలో గంగమ్మ

by Shyam |
‘కొండపోచమ్మ’ సిగలో గంగమ్మ
X

దిశ, మెదక్: కొండపోచమ్మసాగర్ శిగలో గంగమ్మ పరవళ్లు తోక్కనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో అత్యధిక ఎత్తులోకి గోదావరి నది నీళ్లు చేరనున్నాయి. గోదావరి నదిపై లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల ద్వారా తరలించే నీరు 618 మీటర్ల అత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతాయి. 15 టీఎంసీల సామర్ధ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీటి అవసరాల కోసం నీరు కరువు ప్రాంతాలకు చేరుతుంది.

‘కొండ పోచమ్మ’ పేరుకు కారణమిదే..

అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కొండ పోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండ పోచమ్మ ఆలయం ఉంటుంది. సమీపంలోనే కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం (మల్లన్న గుడి) ఉంటుంది. రెండు ఆలయాలకు ఎంతో ప్రసిద్ధి ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే దేవాలయాలు. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్‌కు మల్లన్న సాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండ పోచమ్మ సాగర్ అని సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. కొండ పోచమ్మ సాగర్ కూడా ఈ ప్రాంత వ్యవసాయానికి, తాగునీటికి, ఇతర అవసరాలు కూడా తీర్చేదిగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమ్మవారి పేరు పెట్టారు.

2.85 లక్షల ఎకరాలకు సాగునీరు..

రైతన్న సాగునీటి కష్టాలు తీర్చే కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి రెడీ అయ్యింది. సిద్ధిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య తీరుతుంది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 26 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తారు. రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు 4,700 ఎకరాలను సేకరించారు. అయితే ములుగు మండలంలోని మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి మళ్లింపు..

వాస్తవానికి రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటిని తరలించి అక్కడి నుంచి 21.335 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్ ద్వారా కొండపోచమ్మకు నీటిని మళ్లించాల్సిఉంది. అయితే మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. రంగనాయక సాగర్ నుంచి టన్నెల్ ద్వారా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన సర్జిపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోదావరి జలాలను విడుదల చేశారు. ఇక్కడి నుంచి మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ వద్ద నుంచి గజ్వేల్ మండలం అక్కారం వద్ద నిర్మించిన పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి.. ఆ తర్వాత మర్కుక్ వద్ద నిర్మించిన మరో పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటిని తరలించిన తర్వాత కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎత్తి పోయనున్నారు.

ఎనిమిది ప్రధాన కాల్వలు..

కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ 8 కిలో మీటర్ల మేర వలయాకారంలో నిర్మించారు. మూడు పాయింట్ల వద్ద నీటిని పంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఐదు జిల్లాల పరిధిలోని గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లోని 26 మండలాల్లోని గ్రామాలకు ఎనిమిది ప్రధాన కాల్వల (135 కిలో మీటర్లు) ద్వారా గోదావరి జలాలను మళ్లించనున్నారు. ఇందుకు ఇప్పటికే జగదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, తుర్కపల్లి, ఎం తుర్కపల్లి, రామాయంపేట, గజ్వేల్, కిష్టాపూర్, శంకరంపేట, ఉప్పరపల్లి కాల్వలు రెడీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed