- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండపోచమ్మ కాల్వకు భారీ గండి
దిశ, మెదక్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నెలరోజుల క్రితం హట్టహాసంగా ప్రారంభమైన కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండి పడింది. దీంతో వెంకటాపురం గ్రామాన్ని వరద ముంచెత్తింది. గ్రామంలోని పలు ఇళ్లలో మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. జగదేవ్‌పూర్, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులను నింపడానికి కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు.
ఇదే సమయంలో భారీగా వర్షాలు పడటంతో కాల్వకు వరద పోటెత్తింది. దీంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో కాలువకు భారీ గండి పడింది. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గండిని పూడ్చారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడిన సంగతి తెలిసిందే.