‘కేసీఆర్‌ను ఇంటికి పంపించ‌డ‌మే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం’

by Shyam |
‘కేసీఆర్‌ను ఇంటికి పంపించ‌డ‌మే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం’
X

దిశ ప్ర‌తినిధి,వరంగ‌ల్: స్వరాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను నిర్లక్ష్యం చేయడంతో ఎందరో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీజేఎస్ అధ్య‌క్షుడు, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ప్రొఫెస‌ర్‌ కోదండరాం అన్నారు. హ‌న్మ‌కొండ‌లోని పార్టీ ఎన్నిక‌ల కార్యాల‌యంలో విలేకరుల స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ….కాంట్రాక్టు కార్మికులు దుర్భ‌ర జీవితాన్ని గడుపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పాఠ‌శాల‌ల్లో వాలంటీర్లుగా ప‌నిచేస్తున్న వారిని మ‌ళ్లీ తీసుకుంటారో లేదోన‌న్న టెన్ష‌న్ వారిలో క‌నిపిస్తోంద‌ని అన్నారు. అన్ని ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల్లో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు అసంతృప్తితో ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. పాఠ‌శాల‌ల్లో మూడో త‌ర‌గ‌తి ఉద్యోగులు ప‌నిభారాన్ని మోస్తున్నార‌ని అన్నారు. పాఠ‌శాల‌ల పునఃప్రారంభ‌మైన‌ప్ప‌టికీ వ‌స‌తులు క‌న‌బ‌డ‌టం లేద‌ని అన్నారు. అనేక‌చోట్ల పిల్ల‌లే స్కూలు ప‌నులు చేస్తున్న దృశ్యాల‌ను తాను స్వ‌యంగా చూసిన‌ట్లుగా కోద‌డ‌రాం పేర్కొన్నారు.

Advertisement

Next Story