చంద్రబాబుకు వయసు పెరుగుతున్నా బుద్ది పెరగడం లేదు : కొడాలి నాని

by srinivas |
చంద్రబాబుకు వయసు పెరుగుతున్నా బుద్ది పెరగడం లేదు : కొడాలి నాని
X

దిశ, వెబ్ డెస్క్ : చంద్రబాబు ధర్న పై కొడాలి నాని ఫైర్ అయ్యడు. ఆయన హయాంలో డీజిల్ పై 2 రూపాయల సర్ చార్జ్ విధించిన విషయం ఎవరూ మరిచిపోరన్నాడు. ఎక్కడైన పెట్రోల్ , డీజిల్ ధరలు ముఖ్యమంత్రి తగ్గిస్తాడా అని ప్రశ్నించాడు. దొంగ ధర్నాలు చేస్తే ప్రజలు మళ్లీ చంద్రబాబుకు బుద్ది చెబుతారని హెచ్చరించాడు. బద్వేల్ లో బీజేపీ కి డిపాజిట్ కూడా దక్కలేదని, ఇప్పటికైనా ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుసుకోవాలన్నారు.

ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పెట్రోల్ పోసి తగల బెట్టారన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ బుద్ది మాత్రం పెరగలేదన్నారు. ఇంకా బీజేపీ నేతలు బ్రమల్లో బతుకుతున్నారని, ఇప్పటికైనా వాస్తవంలోకి రావాలని సూచించాడు. ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టే ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డి పార్టీకి బ్రహ్మ రథం పడుతున్నారన్నారు. ఇప్పటికే ఒక పార్టీ మీద పెట్రోలు మరో పార్టీ మీద డీజిలు పోసి తగల బెట్టారన్నాడు.

Advertisement

Next Story