సమాధానం చెప్పేలోపే ఓవైసీ పారిపోయారు: కిషన్ రెడ్డి

by Shyam |
సమాధానం చెప్పేలోపే ఓవైసీ పారిపోయారు: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం యత్నిస్తోందని.. లోక్‌సభలో జమ్ముకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో సహా ఏ నగరాన్ని కూడా యూటీ చేయమన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్‌-ఎంఐఎంకు అలవాటుగా మారిందని విమర్శించారు. సమాధానం చెప్పేలోపే అసదుద్దీన్ సమావేశాల పారిపోయారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story