నారాయణఖేడ్‌లో కిలాడీ లేడి అరెస్ట్

by Sumithra |

దిశ, మెదక్: భోజనం పేరుతో మగవారిని తన రూముకు పిలిపించుకుని అనంతరం తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణఖేడ్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండలం సాదు తండాకు చెందిన పవర్ చంద్రకళ ప్రస్తుతం నారాయణఖేడ్‌లోని మంగళ్‌పేట్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఈ నెల 21న ముకుంద నాయక్ తండాకు చెందిన చవాన్ విఠల్, ఆకలాయి తాండాకు చెందిన జాదవ్ భరత్‌లను భోజనం పేరుతో ఇంటికి పిలిపించుకుని బంధించింది. కోరిక తీర్చమని బలవంతం చేసి ఆపై రూ.40 వేలు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెడతానని బెదిరించి రూ.30 వేల నగదు వసూలు చేసింది. అనంతరం బాధితులు చంద్రకళపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రకళను శనివారం అరెస్ట్ చేసి.. రూ. 30,000 నగదు, 7 సెల్ ఫోన్‌లు, ఆధార్ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story