సెప్టెంబర్‌లో భూల్ బులియా -2

by Shyam |
సెప్టెంబర్‌లో భూల్ బులియా -2
X

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మెగా పవర్‌స్టార్ రాంచరణ్‌తో ఆడిపాడిన కియారా అద్వానీ.. ఆ తర్వాత తెలుగు సినిమాలకు సైన్ చేయలేదు. షాహిద్ కపూర్‌ ‘కబీర్ సింగ్’ ఆఫర్ రావడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయిన ఈ అమ్మడు.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత అక్షయ్ కుమార్‌తో ‘లక్ష్మి బాంబ్’లో చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం తను నటిస్తున్న హర్రర్ కామెడీ ‘భూల్ బులియా 2’ సెట్స్ మీదుంది. కాగా లాక్‌డౌన్ కారణంగా ఇంతకాలం ఈ సినిమా షూటింగ్ జరగలేదు. ఇటీవలే సినిమా షూటింగ్‌లకు అనుమతినివ్వడంతో.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

‘ఈ సినిమా కోసం లక్నోలో వేసిన సినిమా సెట్‌లో లాక్‌డౌన్ వల్ల ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. త్వరలోనే మిగతా సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి ఆ సెట్‌కు వెళ్లాలి. సినిమా కన్నా కాస్ట్ అండ్ క్రూ ప్రాణాలు ముఖ్యం. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావడంతోనే.. సినిమా షూటింగ్ మొదలు పెడతాం. సెప్టెంబర్ వరకు భూల్ బూలియా -2 సెట్లో అడుగుపెడతామని ఆశిస్తున్నాను’ అని దర్శకుడు అనీస్ బజ్మీ తెలిపారు. ఈ చిత్రంలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నారు. ఈ మూవీని జులై 31, 2020న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ .. కరోనా కారణంగా పోస్ట్‌పోన్ అయ్యింది. 2007లో వచ్చిన భూల్ బూలియాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, విద్యా బాలన్ హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story