నా బెడ్‌‌రూమ్‌కు నేనే మహారాణి : ఖుషీ కపూర్

by Shyam |   ( Updated:2021-05-25 08:06:02.0  )
నా బెడ్‌‌రూమ్‌కు నేనే మహారాణి : ఖుషీ కపూర్
X

దిశ, సినిమా : బోనీ కపూర్, లేట్ శ్రీదేవిల రెండో కూతురు ఖుషీ కపూర్ తాజాగా తన బెడ్‌రూమ్ పిక్చర్స్ షేర్ చేసింది. పర్పుల్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ, పడక గదిలో నేలపై కూర్చున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. గులాబీ రంగు కార్పెట్‌తో పరచబడిన ఫ్లోర్ డిఫరెంట్ ఫీల్ ఇస్తోంది. అందుకే కాబోలు ఆ కార్పెట్‌పై కూర్చున్న ఖుషీ తన ఫొటోకు ‘ప్రిన్సెస్ ఆఫ్.. మై బెడ్‌రూమ్’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ ఫొటోపై స్పందించిన సోదరి అన్షులా కపూర్, ఆంటీ మహీప్ కపూర్.. కామెంట్ సెక్షన్‌లో హార్ట్, ఫైర్ ఎమోజీలతో రిప్లయ్ ఇవ్వడం విశేషం. కాగా ఈ ఏడాది మొదట్లోనే ఖుషీని ఇండస్ట్రీలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన బోనీ కపూర్.. ఆ తర్వాత తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే హోమ్ బ్యానర్‌ నుంచి ఇంట్రడ్యూస్ కావడం కన్నా, డెబ్యూ మూవీ ఇతర సంస్థలో చేస్తేనే ఖుషీ నటిగా నేర్చుకోగలుగుతుందని అభిప్రాయపడ్డ బోనీ.. త్వరలోనే ఓ మంచి బ్యానర్ నుంచి తన ఎంట్రీ ఉంటుందని హింట్ ఇచ్చారు.

Advertisement

Next Story