పోలవరం డీపీఆర్-2పై కీలక భేటీ

by srinivas |
పోలవరం డీపీఆర్-2పై కీలక భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు డీపీఆర్-2పై సోమవారం చర్చ జరిగింది. ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు. కేంద్రం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న డీపీఆర్-2ను ఆమోదించే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులో కొన్ని విభాగాల ఖర్చు పరిమితిపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం విధిస్తున్న పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. సాంకేతిక సలహా కమిటీ సవరించిన అంచనాలకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. డీపీఆర్‌-2ను ఆమోదిస్తే పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.

అలాగే రివైజ్డ్ కాస్ట్ కమిటీ కోతపెట్టిన అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రాజెక్టు విషయంలో రూ.55,656 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ అనుమతిచ్చింది. అయితే రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ.47,725 కోట్లకే ఆమోదించింది. దీంతో ఈ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో కేవలం అంశాలపై చర్చ జరిగిందే తప్ప ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలుస్తోంది. ఇకపోతే ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, నీటిపారుదలశాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ప్రాజెక్టు సీఈ హాజరవ్వగా.. కేంద్రం నుంచి జలశక్తిశాఖ సలహాదారు, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌, పీపీఏ సీఈవో హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed