చలించిన పోలీసు హృదయం.. ఓ వ్యక్తి రూపాన్నే మార్చేసింది..!

by Sridhar Babu |
చలించిన పోలీసు హృదయం.. ఓ వ్యక్తి రూపాన్నే మార్చేసింది..!
X

దిశ, కరీంనగర్ సిటీ: ఖాకీలు అంటే లాఠీలు చేతబట్టి.. తమ కాఠిన్యాన్ని చూపుతారనేది సమాజంలో ఉన్న భయం. అది అపోహ మాత్రమేనని కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసులు నిరూపించారు. స్టేషన్‌ పరిధి మొలాంగుర్ గ్రామ బస్టాండ్‌లో కొద్ది రోజులుగా ఓ వ్యక్తి కాలం వెల్లదీస్తున్నాడు. నా అనే వారు లేక.. ఎలాంటి ఆలనా పాలనా లేక కడు దయనీయ స్థితిలో జీవిస్తున్నాడు. చినిగిన బట్టలు, మాసిన జుట్టు, గడ్డంతో రోజుల తరబడి అన్నపానీయాలు లేక బతికున్న అస్థి పంజరంలా పడి ఉన్నాడు.

ఇదే సమయంలో మంగళవారం అటుగా వెళ్లిన కేశవపట్నం ఎస్సై ప్రశాంత్ రావు, సిబ్బంది సూర్య కృష్ణ, లక్ష్మణ్, రవిలు ఆయనను గమనించారు. ఒక్కసారిగా అతడిని చూసి పోలీసు హృదయాలు చలించిపోయాయి. వెంటనే సదరు వ్యక్తిని అక్కున చేర్చుకున్నారు. జుట్టు, గడ్డాన్ని దగ్గరుండి తీయించి స్నానం కూడా చేయించారు. అనంతరం కొత్త బట్టలు అందజేశారు. కడుపు నిండా భోజనం పెట్టారు. పోలీసుల దయా గుణంతో ఆ వ్యక్తి రూపమే మారిపోయింది. ఖాకీ కనికరాన్ని చూసిన జనాలంతా పోలీసులను ప్రశంసించారు. విషయం తెలుసుకున్న హుజురాబాద్ రూరల్ సీఐ ఎర్రల కిరణ్ శంకరపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఎస్‌ఐతో పాటు సిబ్బందిని అభినందించారు.

Advertisement

Next Story