కరీంనగర్ వాసిని ఘనంగా సత్కరించిన కేరళ ప్రజలు.. ఎందుకో తెలుసా..!

by Sridhar Babu |
కరీంనగర్ వాసిని ఘనంగా సత్కరించిన కేరళ ప్రజలు.. ఎందుకో తెలుసా..!
X

దిశ, మానకొండూరు : కేరళ రాష్ట్రంలో కరీంనగర్ వాసిని ఘనంగా సత్కరించారు. ఆ రాష్ట్రానికి చెందిన ప్రాచీన కళ అయిన ‘కలరీ’ విద్యను అందరినీ నేర్పిస్తూ దానిని బతికిస్తున్నందున కరీంనగర్‌కు చెందిన శంకరపట్నం తాడికల్ గ్రామ వాసి జనగాం శ్రీనివాస్‌ను అక్కడి వ్యక్తులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అతి ప్రాచీనమైన కలరీ విద్యతో పాటు అనేక యుద్ధ విద్యలు నేర్పినటువంటి అలంగాడ్ యోగం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అయ్యప్ప సంగమంలో భాగంగా అలంగాడ్ యోగం తన సేవలను గుర్తించి శాలువాలతో సన్మానించి ప్రశంస పత్రాన్ని అందజేసినట్టు చెప్పారు.

కార్యక్రమంలో ఛైర్మెన్ అయ్యప్పదాస్, అలువా ఎమ్మెల్యే అన్వర్ సాదత్, శబరిమల మెల్ శాంతులు శ్రీ సుధీర్ నంబూద్రి, దామోదరన్ పొట్టి, పరమేశ్వరన్ నంబూద్రి, ఈజికోడే శశి నంబూద్రి, నారాయణ్ నంబూద్రి, ట్రావెన్ కోర్ దేవస్థానం మాజీ బోర్డ్ ఛైర్మెన్ శ్రీ రామన్ నాయర్, అలంగాడ్ యోగం మేనేజింగ్ ట్రస్టీ కాంబిల్లి వేణుగోపాల్, హరీష్ కన్నన్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ భేతి తిరుమల్ రావు, తేలు శ్రీనివాస్, మసీదు రాజేందర్ గౌడ్, కనపర్తి విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed