ఆన్‌లైన్ లిక్కర్ యాప్‌నకు అనూహ్య స్పందన

by vinod kumar |
ఆన్‌లైన్ లిక్కర్ యాప్‌నకు అనూహ్య స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు నష్టాలు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడింది. దాంతో లాక్డౌన్ 4.0లో ఆంక్షలతో కూడిన సడలింపులిచ్చింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ఆదాయం సమకూరేది ‘లిక్కర్’ విక్రయాల ద్వారానే. దాంతో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా మద్యం దుకాణాలు ఓపెన్ చేశాయి. కానీ.. వైన్స్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదంటూ.. సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయినా.. కొన్ని రాష్ట్రాలు ఆ విషయంలో అలానే ముందుకు వెళ్లాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆన్‌లైన్ లిక్కర్ అమల్లోకి తెచ్చాయి. దీనికి భారీగానే రెస్పాండ్ వచ్చింది. అందులో కేరళ రాష్ట్రం కూడా ఒకటి. అంతటితో ఆగకుండా కేరళ మరో అడుగు ముందుకు వేసి.. ఆన్ లైన్ లిక్కర్ యాప్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకువచ్చిన ‘బేవక్యూ (BEVQ)’ అనే లిక్కర్ యాప్ గురువారం గూగుల్ యాప్ స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది.

ఏ రాష్ట్రంలోనైనా… వైన్ షాప్‌నకు వెళ్లి డబ్బులు ఇస్తే చాలు… మనకు కావాల్సిన బ్రాండ్ లిక్కర్ తీసుకుని రావచ్చు. కానీ, కేరళవాసులు వైన్ షాప్‌నకు వెళ్లగానే మందు తీసుకోవడం కుదరదు. లిక్కర్ కొనాలంటే.. బేవ్ క్యూ యాప్ ద్వారా ముందుగా బుకింగ్ చేసుకోవాలి. ఆ యాప్ నుంచి ఫోన్ కు ఈ టోకెన్ నెంబర్ వస్తుంది. దాన్ని వైన్ షాప్ లో చూపిస్తే.. లిక్కర్ తీసుకోవచ్చు. వైన్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడం కోసం ఈ తరహా ప్రయోగానికి కేరళ శ్రీకారం చుట్టింది.
గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తెచ్చిన కొద్ది గంటలకే 1.8 లక్షల మందికి పైగా వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోవడం విశేషం. ఒక వినియోగదారుడు బేవ్ క్యూ యాప్ ను ఉపయోగించి.. లిమిటెడ్ గా మాత్రమే లిక్కర్ కొనుగోలు చేయవచ్చు. అయితే టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ వస్తున్నట్లు కస్టమర్లు చెబుతున్నారు. ఈ టోకెన్ ఉన్నా గానీ, వైన్స్ షాప్ లో ఇంకా ఆ నంబర్ ఆప్టేడ్ కాకపోవడం వల్ల వెయిట్ చేయాల్సి వస్తుందని కస్టమర్లు అంటున్నారు. కోచికి చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఫెయిర్ కోడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ బేవ్ క్యూ యాప్ ను రూపొందించింది. బేవ్ క్యూ యాప్ లో వస్తున్న టెక్నికల్ ఇష్యూలను వీలైనంత త్వరలోనే సాల్వ్ చేస్తామని ఫెయిర్ కోడ్ చెబుతోంది.

Advertisement

Next Story

Most Viewed