కీర్తి సురేశ్‌ కు భారీ ఆఫర్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

by Shyam |
కీర్తి సురేశ్‌ కు భారీ ఆఫర్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!
X

దిశ, సినిమా: టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహానటి కీర్తి సురేశ్‌.. రాబోయే మూవీ ‘దసరా’ కోసం భారీ పారితోషికం తీసుకుంటుందని టాక్. ఇటీవల దసరా పండుగను పురస్కరించుకుని నాని కొత్త చిత్రం ‘దసరా’ను మేకర్స్ ప్రకటించగా.. ఈ సినిమా కోసం రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే, టైటిల్‌ టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా.. నాని లుక్ కొత్తగా ఉండటం, తెలంగాణ యాస చక్కగా మాట్లాడటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇక భారీ బడ్జెట్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదని చిత్ర బృందం భావిస్తోందట. అందులో భాగంగానే ఆమె అడిగిన పారితోషికాన్ని ఇస్తునట్లు తెలుస్తోంది. గతంలో నానితో కలిసి కీర్తి సురేశ్‌ ‘నేను లోకల్‌’ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘భోళా శంకర్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story