సర్కార్ వారి పాటలో కీర్తి పాత్ర అదే?

by Jakkula Samataha |
సర్కార్ వారి పాటలో కీర్తి పాత్ర అదే?
X

ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలతో నటిస్తున్న కీర్తి సురేష్.. ఈ మధ్య పెంగ్విన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో కీర్తి తన నటనతో భారీ ప్రశంసలు అందుకుంది. పెంగ్విన్ రిలీజ్ టైమ్‌లోనే అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్‌లో పాల్గొన్న కీర్తి.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సర్కార్ వారి పాట’ సినిమాలో తానే హీరోయిన్ అని వెల్లడించింది. కాగా ఈ సినిమాలో కీర్తి రోల్ గురించి ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

సర్కార్ వారి పాటలో కీర్తి బ్యాంక్ ఎంప్లాయిగా కనిపించబోతున్నట్లు టాక్. ఈ క్రమంలోనే బ్యాంక్‌కు వచ్చిన హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబును చూసి ప్రేమలో పడుతుందని సమాచారం. కాగా ఇందులో మహేశ్ ఫుల్ మాస్ రోల్‌లో కనిపిస్తాడని ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ అయింది. చెవికి పోగు, రఫ్ హెయిర్, టాటూతో కనిపించిన మహేశ్ లుక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

Advertisement

Next Story