- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఆ నియోజకవర్గానికే కొత్త పెన్షన్లు
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఉప ఎన్నికలకు ముందే అధికార పార్టీ తాయిలాలకు శ్రీకారం చుట్టింది. టీఆర్ఎస్ మార్క్ రాజకీయం మొదలుపెట్టింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడం… ఎలాగైనా హుజురాబాద్‌లో గట్టెక్కడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈటల వెంట ఉండే అనుచరులకు వల వేయడంతో పాటుగా ప్రతిపక్ష పార్టీల నేతలను సైతం తమవైపునకు తిప్పుకుంది. బీజేపీ నేతలకు సైతం గాలం వేసింది. తాజాగా ఓటర్లకు ఎర వేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మూడేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లను మంజూరు చేస్తోంది.
కేవలం హుజురాబాద్సెగ్మెంట్కే..
రాష్ట్రంలో ఇటీవల కొత్త పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. 57 ఏండ్ల పెన్షన్ కూడా ఇస్తామని ప్రకటించినా… ఇంకా దరఖాస్తుల పరిశీలనే పూర్తి కాలేదు. గతంలో పరిశీలన చేసి, ఆమోదం చెప్పిన వాటిని కూడా రాష్ట్రస్థాయిలో పెండింగ్పెట్టింది. కానీ హుజురాబాద్నియోజకవర్గంలో మాత్రం ఆగమేఘాల మీద ఆసరా పెన్షన్లను మంజూరు చేసింది. గ్రామాల వారీగా కొత్త పెన్షన్‌దారుల జాబితాను పంపించారు. వాస్తవానికి కరీంనగర్జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు 44 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటుగా మరో 40 వేల దరఖాస్తులు 57 ఏండ్ల పైబడిన వారివి కూడా ఉన్నాయి. కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 11 వేలకు పైగా కొత్త ఆసరా పెన్షన్లను యుద్ధప్రాతిపదికన మంజూరు చేశారు. శుక్రవారం గ్రామాల వారీగా అధికారులు సమాచారం అందించారు. ఆన్లైన్లో కొత్త పెన్షన్ మంజూరైన వివరాలను గ్రామాల్లో అధికారులు ప్రత్యేకంగా వెల్లడించారు. వీరందరికీ వచ్చేనెల నుంచి పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
2018 నుంచి బ్రేక్ కానీ..
రాష్ట్రంలో 2018 ఎన్నికల తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్కూడా మంజూరు చేయలేదు. కానీ చనిపోయిన వారు, వలస వెళ్లిన వారిని గుర్తించి దాదాపు 82 వేల పెన్షన్లను తొలిగించారు. వారి స్థానంలో కొత్తవాటిని మంజూరు చేయాలని వేడుకున్నా కనికరించలేదు. అప్పటి నుంచి పలుమార్లు కొత్త పెన్షన్లు ఇస్తామని, 57 ఏండ్ల అర్హత వయస్సును అమలు చేస్తామని ప్రకటిస్తూనే ఉన్నారు. అంతకు ముందు 2019, మార్చి నుంచే ఇస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు.
ఎన్నికలు వస్తే కొంత నయం
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే నియోజకవర్గాలకు కొంత కలిసి వస్తోంది. గతంలో హుజూర్నగర్ఉప ఎన్నికల సమయంలో అక్కడి వారికి కూడా పలు వరాలు కురిపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా… ఆ సెగ్మెంట్‌కు మాత్రమే రైతుబంధు ఇచ్చారు. ఆ తర్వాత దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా ముందుగా రాష్ట్రం మొత్తం కాదని దుబ్బాకకే రైతుబంధు తొలుతగా ఇచ్చారు. అంతేకాకుండా యువతకు ఉపాధి రుణాలు కూడా చెల్లించారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ఉప ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాలకు ప్రత్యేక నిధులిచ్చారు. అప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్స్ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల మీద పడకుండా రాష్ట్ర సర్కారు సాగర్ఎన్నికలకు జాగ్రత్తలు తీసుకుంది.
వాస్తవానికి 2019 అక్టోబర్‌లో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్‌కు ముందు హుజూర్ నగర్ రైతులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు రైతుబంధు సాయం అందించారు. ఓ వైపు ప్రచారం జరుగుతోంటే మరోవైపు రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రైతుల ఓటింగ్ శాతం పెరిగి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని ఇప్పటికీ టీఆర్ఎస్నేతలు చెప్పుకుంటూనే ఉన్నారు.
హుజురాబాద్‌లో అదే ఎర..
ప్రస్తుతం హుజురాబాద్సెగ్మెంట్లో ఓటర్లకు తాయిలాలను ఎర వేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పాటుగా ఈ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా తీసుకుంటున్నారు. అందుకే రాష్ట్రస్థాయి నాయకత్వం మొత్తం హుజురాబాద్‌లో బైఠాయించింది. మంత్రులు కూడా గ్రామాలకు వెళ్లి తిరుగుతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామానికి జిల్లా స్థాయి నేతలను ఇంచార్జీలుగా వేశారు. ఇవన్నీ చేస్తూనే… ఈటల రాజేందర్‌కు ఇంకా కొంత సానుభూతి ఉందనే కారణంగా ఇప్పుడు తాయిలాలను ఎరగా వేస్తున్నారు. మూడేండ్ల నుంచి ఇవ్వని ఆసరా పెన్షన్లను మంజూరు చేశారు. ఓటుకు రూ.2 రెండు వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని గ్రామాల్లోనూ ప్రచారం జరుగుతోంది.