- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR టార్గెట్‌గా మరోసారి రాజకీయ రచ్చ.. కేసీఆర్ సర్కార్ గురి పెట్టిందా?
దిశ, వెబ్ డెస్క్: బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా రచ్చ రేపుతోంది. ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో అనుమతి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం దుమారం రేపుతోంది. దీనిపై చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వినాయక మండపాల బందోబస్తు కారణంగా సిబ్బంది బిజీగా ఉన్నారని, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే జనాలను కంట్రోల్ చేయలేమంటూ చివరి నిమిషంలో పోలీసులు చెప్పడంపై సినిమా యూనిట్ మండిపడుతోంది. వినాయక చవితి ఉందంటే.. ముందే అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని, ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఏర్పాట్లన్నీ పూర్తి అయిన తర్వాత నిరాకరిస్తే ఎలా అంటూ సినిమా యూనిట్ ప్రశ్నలు కురిపిస్తోంది.
అయితే ఇటీవల అమిత్ షాను ఎన్టీఆర్ కలిసిన నేపథ్యంలో బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రాజకీయ రంగు పులుముకుంది. బ్రహ్మాస్త్ర సినిమాకు సౌత్ ఇండియాలో సమర్పకుడిగా దర్శకధీరుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను ఇటీవల రాజ్యసభకు బీజేపీ పంపింది. బీజేపీ టార్గెట్ తీవ్ర విమర్శలు కురిపిస్తున్న సీఎం కేసీఆర్.. బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తున్న క్రమంలో చివరి నిమిషంలో అనుమతి ఇవ్వకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ను టార్గెట్ చేసే కేసీఆర్ సర్కార్ అనుమతి ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి.
అనుమతి ఇవ్వకూడదని భావిస్తే.. పర్మిషన్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడే నిరాకరించి ఉండాల్సిందని, ఇప్పుడు సడన్ గా అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయం కోణం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-అమిత్ షా భేటీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అమిత్ షాను కలవడం ద్వారా బీజేపీకి సపోర్ట్ గా ఎన్టీఆర్ ఉన్నాడనే సంకేతాలను ప్రజల్లోకి బీజేపీ పంపగలిగింది. ఇలాంటి తరుణంతో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వకపోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ పరిణామంతో ఎన్టీఆర్ పై కేసీఆర్ సర్కార్ గురి పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : నందమూరి హరికృష్ణ జయంతి.. తండ్రిని గుర్తు చేసుకున్న Jr.ఎన్టీఆర్