కాంగ్రెసోళ్లు బఫూన్లు

by Shyam |
కాంగ్రెసోళ్లు బఫూన్లు
X
  • ప్రెస్‌మీట్‌లో కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో :
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు బఫూన్లు, జోకర్లుగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రైతు పండించిన పంటను వందశాతం కొనుగోలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని, అయినా కాంగ్రెస్ నాయకులు పొద్దుపోక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కరోనా కట్టడిలో సమర్థవంతంగా పనిచేస్తూ, దేశంలో ఏ రాష్ట్రాలు చేపట్టని కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తున్నా.. కాంగ్రెస్‌ అనవసర రాజకీయాలు చేస్తోందన్నారు. ఒకే విడతలో రుణమాఫీ హామీతో పాటు తెలంగాణలో అమలవుతున్న మంచి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. కాంగ్రెస్ నాయకులు విషయాలు తెలుసుకొని మాట్లాడాలని, పనిలేక ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

Tags: KCR, pressmeet, corona, lockdown, congress, farmers

Advertisement

Next Story